పీఎఫ్ క్లెయిమ్ చేశారా.. స్టేటస్ ఇలా తెలుసుకోండి
కొన్నిసార్లు EPF ఖాతాదారులు అవసరం నిమిత్తం పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటారు. అందుకోసం ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది.
EPFO Claim Status Online: ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులలో చాలా మందికి ఈపీఎఫ్ఓ ఖాతా ఉంటుంది. కొన్నిసార్లు వారి అవసరం నిమిత్తం పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకుంటారు. అందుకోసం ఆన్‌లైన్‌లో పీఎఫ్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. క్లెయిమ్ చేసిన తర్వాత తమ పీఎఫ్ క్లెయిన్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం ఈపీఎఫ్ఓ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకునేందుకు వివరాలు అందిస్తున్నాం. EPFO కొత్త రూల్.. పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..
స్టెప్ 1: EPFO అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లాలి. వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్టెప్ 2: వెబ్‌సైట్‌లో Services మెనులో ఉన్న ‘For Employees’ మీద క్లిక్ చేయాలి
స్టెప్ 3: Servicesలోని ‘Know Your Claim Status’ మీద క్లిక్ చేయాలి
స్టెప్ 4: ఆ తర్వాత యూఏఎన్ (UAN), క్యాప్చ వివరాలు టైప్ చేయాలి. తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి
స్టెప్ 5: PF Number, ఎస్టాబ్లిష్ మెంట్ కోడ్ టైప్ చేయాలి. డ్రాప్ డౌన్ నుంచి పీఎఫ్ ఆఫీసు సెలక్ట్ చేయాలి. ఏ రాష్ట్రానికి చెందిన పీఎఫ్ ఖాతానో తెలపాలి.
స్టెప్ 6: వివరాలన్నీ పొందుపరిచాక సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
స్టెప్ 7: క్లెయిమ్ స్టేటస్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ
కాగా, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉద్యోగులకు EPFO ఓ అవకాశాన్ని కల్పించింది. ఖాతాదారులు PF బ్యాలెన్స్‌లో 75 శాతం లేక మూడు నెలల బేసిక్ శాలరీ, డీఏలలో ఏది తక్కువ అయితే దాన్ని నాన్ రీఫండబుల్ అడ్వాన్స్‌గా విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో 6 కోట్ల మంది ఖాతాదారులకు లబ్దిచేకూరనుంది. Employer PF Contribution: జీతం నుంచి డబుల్ PF కట్ అవుతుందా.. EPFO రూల్స్‌లో ఏముంది? జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ